Posts

అద్దం లో నా కళ్ళు

అద్దం లో నా కళ్ళు నన్ను జాలిగా చూస్తూ ఎక్కడ ఉన్నావ్ అని అడిగితే న గతంలో నన్ను నేను వెతుకున్న ఆటలడాని పసితనం స్నేహితులు లేని బాల్యం చదువు తప్ప వేరే ఆలోచనలేని బాధ్యత తప్ప సుఖం లేని యవ్వనం ఉద్యోగం కోసం ఊరు దాటిన వైనం శ్రమకి తాపీదులు తప్ప జీతాలుపెంచని సంస్తలు అద్ది కంటే సొంత ఇల్లు సుఖమని అప్పుచేసిన తీరు కన్నవారి ఆరోగ్యాభిమాలు కోసం బడా సంస్థను వీడలేని ధీనం కుటంభం కోసం శ్రమిస్తు కుటంబానికి సమయం ఇవ్వలేని మనుగడ ఉద్యోగఅనుభవం పెరిగేకొద్దీ ఉంటుందో ఊడుతుందో అన్న ఉద్యోగం ఆశలకు అవకాశాలకు మధ్య నలిగే ఓ మెరుగు మధ్యతరగతి వాడి కళ్ళు ఇలానే ఉంటాయి అంటూ వెతుకుంటు వెతుకుంటు వర్తమానంలో కలుసుకున్న. - శ్రీ (శ్రీనివాస్ జి.)

గెలుపు ఓటమి

గెలవడం గొప్ప అనుకోకు ఓడడం తప్పు అనుకోకు గెలిచి ఓడడం రావణ రామాయణసారం వోడి గెలవడం పాండవ మహాభారతం

అందానికి అర్ధం నువ్వా..

అందానికి అర్ధం నువ్వా పరువానికి పర్యాయం నువ్వా వయ్యారానికి వ్యాకరణం నువ్వా కనుల బాసలకు నిగంటువు నువ్వా అతిసేయుక్తికానీ అతిలోకసుందరివి నువ్వా

స్నేహం

స్నేహం - సమం అనుకునేది అహం లేనిదీ భుజం పట్టేది వెన్ను తట్టేది తప్పు చూపేది వున్నది పంచేది కలిసి తెరిగేది ఆనందానికి కారణమైయేది బాధ్యతగ మారేది జాతి కులమతాలకు అతీతమైనది మంచిచెడులు తెలియనిది హితవు కోరేవాడు స్నేహితుడు మితం కోరేవార్డు మిత్రుడు - శ్రీ (శ్రీనివాస్ జి. )

Excel - Extension hardening

https://stackoverflow.com/questions/38529251/excel-does-not-prompt-for-incorrect-extension-extensionhardening https://blogs.msdn.microsoft.com/vsofficedeveloper/2008/03/11/excel-2007-extension-warning-on-opening-excel-workbook-from-a-web-site-2/ https://salesforce.stackexchange.com/questions/114584/warning-propmt-on-downloaded-excel-file-format-and-extension-do-not-match-the solution thru Registry edit: https://www.extracomm.com/Extracomm/FAQ.NSF/0/3ACF4AF056A7790848257AD400279396 coldfusion https://www.experts-exchange.com/questions/27027707/ColdFusion-to-Excel-a-solution-to-Extension-Hardening.html

నాన్నకు ప్రేమతో ..

నాన్న ఓ నమ్మకం ఓ ధైర్యం నువ్వు పుట్టాక అరచేతుల్లో పెరిగాక గుండెలమీద పెట్టుకునేవాడు అడిగింది కాదనకా కొనిచ్చేవాడు అల్లరిని సహించేవాడు అమ్మచేతి దెబ్బ పడనివ్వక నిన్ను ఎత్త్తుకొని దాచుకునేవాడు నీకు వయసొచ్చేవరకు నీ భాదేతని తనభుజాలుపై మోసేవాడు తన వయసు అయ్యాక నీ భుజం తనకు ఆసరా అవుతదిఅని ఆశించేవాడు నీ ఉన్నతికోసం తనకున్నది ధారపోసేవాడు నీ సుఖం కోసం తాను కష్టాన్ని వోర్చినవాడు నీ జీవితం పూలబాటకు తాను ముళ్లబాటకు ఈదురువెళ్లినవాడు నువ్వు పడితే చెయ్యిపెట్టి లేపినవాడు నువ్వు ఓడితే వెన్నుతట్టి ధైర్యం చెప్పినవాడు నువ్వు గెలిస్తే భుజంపట్టి ప్రోత్సహించినవాడు నీ పౌరుషం తన రక్తంఅని గర్వపడేవాడు తన కళలు నీ కల్లుతో కానివాడు నీ భవిష్యత్తు తన భాదేతతో తీసుకునేవాడు తన చేతి దెబ్బ నీలో తప్పుని సరిదిద్దింది తన కష్టం నీ భవితకు మార్గం వేసింది ప్రేమని గుండెల్లో ఉంచుకొని కళ్ళల్లో కోపాన్ని చూపించే నా తండ్రి ఆ ముక్కంటికి ఏ మాత్రం తీసిపోడు తండ్రి బీజం తల్లి క్ష్యేత్రం తొమ్మిది నెలలు మోసిన తల్లి కి నువ్వు కొత్త జీవితం మొదలుపెట్టేవరకు నిన్ను మోసే తండ్రికి ఏమిఇచ్చి ఋణం తీర్చుకోగ...

శ్రామికులం - మనమంత ఒక IT కులం

శ్రామికులం మెం కార్మికులం అద్దాల మేడల్లో చెలువురతి భవనాల్లో అలుపుఎరగక పనిచేసే కార్మికులం జీతభత్యాలుతో జీవనశైలిని రాచరికానికి తగ్గక అనుభవించే కార్మికులం ఆటపాటలు తేనేటివిందులు రాత్రియితే మందులు చిందులు మా పనిలో సగభాగం మేము శ్రామికులం తెల్లచొక్కా కార్మికులం. ఎండకు బెదరం వానకి తడవం చలికి వనకం చెబితే వింటాం తిడితే పడతాం చెప్పినట్టుగా చేస్తాం రాజి పడని రాతలు మా ఆయుధాలు మా మేధస్సు చేతివెళ్లే మా పరికరాలు మేము శ్రామికులం మెం మరమనుషులం అప్పులు అవి తెచ్చే తిప్పలు ఐనా మానక చేసే తప్పులు మాలో ఒక భాగం మాటకు విలువండదు చేతిరాతకు బాధులుండదు న కిందవాడు నన్ను తొక్కి ఎఅక్కలనుకుంటాడు పైనఉన్నవాడు నన్ను ఎక్కితొక్కలనుకుంటాడు ఏది ఎలావున్నా మా పని మెం చేసుకుపోతాం మేము శ్రామికులం కొంతమందికి బానిసలం మన భాషకి దూరం మన తిండికి దూరం విదేశాలు మా కల విదేశాలకి ఎగురుతం వాళ్ళకి చాకిరీ చేస్తాం గట్టిగ 'జై హింద్ ' అని అరవడానికి జడుస్తాం పాస్చాత్య ధోరణికి అలవాటు పడినవాళ్ళం మా సంప్రదాయ పద్ధతులు వదిలినవాళ్ళం ఎందుకంటే మేము బాగా చదివి అక్కడ స్థిరపడ్డవా...