అద్దం లో నా కళ్ళు

అద్దం లో నా కళ్ళు నన్ను జాలిగా చూస్తూ ఎక్కడ ఉన్నావ్ అని అడిగితే న గతంలో నన్ను నేను వెతుకున్న
ఆటలడాని పసితనం
స్నేహితులు లేని బాల్యం
చదువు తప్ప వేరే ఆలోచనలేని బాధ్యత తప్ప సుఖం లేని యవ్వనం
ఉద్యోగం కోసం ఊరు దాటిన వైనం
శ్రమకి తాపీదులు తప్ప జీతాలుపెంచని సంస్తలు
అద్ది కంటే సొంత ఇల్లు సుఖమని అప్పుచేసిన తీరు
కన్నవారి ఆరోగ్యాభిమాలు కోసం బడా సంస్థను వీడలేని ధీనం
కుటంభం కోసం శ్రమిస్తు కుటంబానికి సమయం ఇవ్వలేని మనుగడ
ఉద్యోగఅనుభవం పెరిగేకొద్దీ ఉంటుందో ఊడుతుందో అన్న ఉద్యోగం
ఆశలకు అవకాశాలకు మధ్య నలిగే ఓ మెరుగు మధ్యతరగతి వాడి కళ్ళు ఇలానే ఉంటాయి అంటూ వెతుకుంటు వెతుకుంటు వర్తమానంలో కలుసుకున్న.

- శ్రీ
(శ్రీనివాస్ జి.)

Comments

Popular posts from this blog

ASP.NET Compillation Error BC31007 - Solution

Test & Debug WCF service using WCFTestClient.exe

Microsoft Surface in brief