నాన్నకు ప్రేమతో ..

నాన్న ఓ నమ్మకం ఓ ధైర్యం
నువ్వు పుట్టాక అరచేతుల్లో పెరిగాక గుండెలమీద పెట్టుకునేవాడు
అడిగింది కాదనకా కొనిచ్చేవాడు
అల్లరిని సహించేవాడు
అమ్మచేతి దెబ్బ పడనివ్వక నిన్ను ఎత్త్తుకొని దాచుకునేవాడు
నీకు వయసొచ్చేవరకు నీ భాదేతని తనభుజాలుపై మోసేవాడు
తన వయసు అయ్యాక నీ భుజం తనకు ఆసరా అవుతదిఅని ఆశించేవాడు
నీ ఉన్నతికోసం తనకున్నది ధారపోసేవాడు
నీ సుఖం కోసం తాను కష్టాన్ని వోర్చినవాడు
నీ జీవితం పూలబాటకు తాను ముళ్లబాటకు ఈదురువెళ్లినవాడు
నువ్వు పడితే చెయ్యిపెట్టి లేపినవాడు
నువ్వు ఓడితే వెన్నుతట్టి ధైర్యం చెప్పినవాడు
నువ్వు గెలిస్తే భుజంపట్టి ప్రోత్సహించినవాడు
నీ పౌరుషం తన రక్తంఅని గర్వపడేవాడు
తన కళలు నీ కల్లుతో కానివాడు
నీ భవిష్యత్తు తన భాదేతతో తీసుకునేవాడు
తన చేతి దెబ్బ నీలో తప్పుని సరిదిద్దింది
తన కష్టం నీ భవితకు మార్గం వేసింది
ప్రేమని గుండెల్లో ఉంచుకొని కళ్ళల్లో కోపాన్ని చూపించే నా తండ్రి ఆ ముక్కంటికి ఏ మాత్రం తీసిపోడు
తండ్రి బీజం తల్లి క్ష్యేత్రం
తొమ్మిది నెలలు మోసిన తల్లి కి
నువ్వు కొత్త జీవితం మొదలుపెట్టేవరకు నిన్ను మోసే తండ్రికి ఏమిఇచ్చి ఋణం తీర్చుకోగలవు
మా నాన్నకు ప్రేమతో ..
- శ్రీ
( శ్రీనివాస్ జి. )

Comments

గురు said…
Very nice srinu..👌

Note: telugu lipi loo unthe bagunnu

Popular posts from this blog

ASP.NET Compillation Error BC31007 - Solution

Test & Debug WCF service using WCFTestClient.exe

Microsoft Surface in brief