Posts

Showing posts from 2018

ప్రకృతిలో నీవా ? ప్రకృతివేనీవా ?

వసంతపు పుష్పపు పరిమళానివా గ్రీష్పపు స్వాతికిరణానివా శిశిరపు పండువెన్నలవా కమ్మని కోయిల కూతవా కొననులో కమలానివా మట్టినితకిన తొలిచినుకవా ఆరు ఋతువుల్ని అలంకీరించిన ప్రకృతివా చెలీభావంకందని బావానివినీవా ప్రకృతిలో నీవా ప్రకృతివేనీవా

ఆధిపత్యం

కుక్కలు మొరుగుతాయి సింహం గాండ్రిస్తుంది ఏనుగు హుంకరిస్తుంది మనుషులు అరుస్తారు ఇవన్నీ వాటి వాటి ఆధిపత్యాన్ని చూపించుకోవటాని మాత్రమే, అర్ధం చేసుకోవాల్సింది ఐతే ఒక రాయితో కుక్కని, అగ్గితో సింహాన్ని, ఎలుకతో ఏనుగుని ఆపవచ్చుగాక మరి మనిషిని ? మౌనం మాత్రమే సమాధానం. - శ్రీ (శ్రీనివాస్ జి.)

Proud Moment !!

Proud moment !!

స్వేచ్ఛ - స్వచ్ఛంగా నీవెక్కడ?

              స్వేచ్ఛ స్వేచ్ఛ మనలో వుందని భ్రమలో వున్నారు స్వేచ్ఛ మనకు లేదని బాదలో ఉన్నారు స్వేచ్ఛ మాటల్లో ఉందని తిడుతున్నారు స్వేచ్ఛ చేతిలో ఉందని కొడుతున్నారు స్వేచ్ఛ తెలివిలో ఉందని దోచుకుంటున్నారు స్వేచ్ఛ అధికారంలో ఉందని అవినీతి చేస్తున్నారు స్వేచ్ఛ బలంలో ఉందని బానిసలుగా మారుస్తున్నారు స్వేచ్ఛ నువెక్కడ? త్రాగే నీళ్లులో లేవు పీల్చే గాలిలో లేవు ఆడదాని మానానికి లేవు మగాడి అభిమానానికి లేవు పిల్లల ఆటలలో లేవు వాళ్ళ గమ్యానికీ లేవు రైతుల సాగుకు లేవు వాటికొచ్చే బేరానికీ లేవు స్వేచ్ఛ స్వచ్ఛంగా నీవెక్కడ? - శ్రీ (శ్రీనివాస్ జి.)

మహిళా దినోత్సవం

అమ్మని ఎలవున్నావ్ ఏం తిన్నావ్ అని అడగని కొడుకు భార్యని సమానంగా గౌరవించలేని భర్త ఆడపడుచుని ఇంటికి పిలిచి చీర పెట్టని సోదరుడు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెల్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆడపిల్లే వద్దన్న ఆలోచనల్నికలిగువున్న భర్త/మామగారూ అమ్మ ఆలీ ఆడబిడ్డని ఉద్దేశించి తిట్టే కుసంస్కారం కల్గిన ప్రబుద్ధుల 'కామాతురాణం న స్మృతి న లజ్జ' గల కీచకులు ఆడవాళ్ళని ఉద్దేశించి గొప్ప మాటలు చిత్రాలుని సామాజిక మాధ్యమంలో శోధించి ప్రచురించడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. 'ఏత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతా' అని మనుశాస్త్రం కనీసం మనవరకు ఆడవాళ్ళని గౌరవిద్దాం, ఆడపిల్లల్ని చదివిద్దాం. మనోభావాలు నొప్పించడానికి కాదు అభిమతం తెలియపరచటానికి నాయీ అభ్యర్ధన. - శ్రీ (శ్రీనివాస్ జీ.)