దేనికి వారసులం
మనం ఆస్తికి వారసులం ఆశయాలకు కాదు
ధనానికి వారసులం ధర్మానికి కాదు
దేవాలయంలో దీపం పెడతాం బయటికివచ్చి పుగాకు వెలిగిస్తాం
అమ్మవారికి పూజలు చేస్తాం పరాయి స్త్రీలవైపు కామంగా చూస్తాం
నీతి బోధనలు చేస్తాం
అవినీతినీ అవలంబిస్తాం
తల్లిదండ్రులకు విలువేవ్వం
గురువులకు గౌరవివ్వం
మంచి మాటలు వినం
అవి చెప్పేవాళ్ళని చూడం
అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించే అల్లుళ్ళు కోడలాళు ఎంతమంది ఈలోకంలో
తల్లి చెల్లి భార్య ఆడబిడ్డ వున్నవాళ్ళం
ఐనా ఆడవాళ్ళకి అవమానించకమానం
అన్నవదీననీ తల్లిదండ్రులుగా భావించలేం
మరదలిని తోబుట్టువుగా చూడలేం
భార్యలో సొంపులు సంపదలు కావాలి ఆమె ఆశెలు ఆశయాలు అక్కరలేదు
భర్త బాగులో సగం తనదే అంటుందికానీ సద్దుకుపోయే గుణమేది
రామాయణసారం అర్ధం చేసుకొం
గీతాసారం మనకు అనవసరం ఐనా రోజు పూజలు చేస్తాం
ధర్మం తెలుసు ఆచరించం
మానవీయవిలువలు తెలుసు అనుసరించాం
రామాయణానికి వారసులం ఐనా రావణాసురులం సుర్పణకాలం
- శ్రీ
( శ్రీనివాస్ జి. )
Comments