శ్రామికులం - మనమంత ఒక IT కులం
శ్రామికులం మెం కార్మికులం అద్దాల మేడల్లో చెలువురతి భవనాల్లో అలుపుఎరగక పనిచేసే కార్మికులం జీతభత్యాలుతో జీవనశైలిని రాచరికానికి తగ్గక అనుభవించే కార్మికులం ఆటపాటలు తేనేటివిందులు రాత్రియితే మందులు చిందులు మా పనిలో సగభాగం మేము శ్రామికులం తెల్లచొక్కా కార్మికులం. ఎండకు బెదరం వానకి తడవం చలికి వనకం చెబితే వింటాం తిడితే పడతాం చెప్పినట్టుగా చేస్తాం రాజి పడని రాతలు మా ఆయుధాలు మా మేధస్సు చేతివెళ్లే మా పరికరాలు మేము శ్రామికులం మెం మరమనుషులం అప్పులు అవి తెచ్చే తిప్పలు ఐనా మానక చేసే తప్పులు మాలో ఒక భాగం మాటకు విలువండదు చేతిరాతకు బాధులుండదు న కిందవాడు నన్ను తొక్కి ఎఅక్కలనుకుంటాడు పైనఉన్నవాడు నన్ను ఎక్కితొక్కలనుకుంటాడు ఏది ఎలావున్నా మా పని మెం చేసుకుపోతాం మేము శ్రామికులం కొంతమందికి బానిసలం మన భాషకి దూరం మన తిండికి దూరం విదేశాలు మా కల విదేశాలకి ఎగురుతం వాళ్ళకి చాకిరీ చేస్తాం గట్టిగ 'జై హింద్ ' అని అరవడానికి జడుస్తాం పాస్చాత్య ధోరణికి అలవాటు పడినవాళ్ళం మా సంప్రదాయ పద్ధతులు వదిలినవాళ్ళం ఎందుకంటే మేము బాగా చదివి అక్కడ స్థిరపడ్డవా...