స్వేచ్ఛ - స్వచ్ఛంగా నీవెక్కడ?
స్వేచ్ఛ స్వేచ్ఛ మనలో వుందని భ్రమలో వున్నారు స్వేచ్ఛ మనకు లేదని బాదలో ఉన్నారు స్వేచ్ఛ మాటల్లో ఉందని తిడుతున్నారు స్వేచ్ఛ చేతిలో ఉందని కొడుతున్నారు స్వేచ్ఛ తెలివిలో ఉందని దోచుకుంటున్నారు స్వేచ్ఛ అధికారంలో ఉందని అవినీతి చేస్తున్నారు స్వేచ్ఛ బలంలో ఉందని బానిసలుగా మారుస్తున్నారు స్వేచ్ఛ నువెక్కడ? త్రాగే నీళ్లులో లేవు పీల్చే గాలిలో లేవు ఆడదాని మానానికి లేవు మగాడి అభిమానానికి లేవు పిల్లల ఆటలలో లేవు వాళ్ళ గమ్యానికీ లేవు రైతుల సాగుకు లేవు వాటికొచ్చే బేరానికీ లేవు స్వేచ్ఛ స్వచ్ఛంగా నీవెక్కడ? - శ్రీ (శ్రీనివాస్ జి.)