మహిళా దినోత్సవం
అమ్మని ఎలవున్నావ్ ఏం తిన్నావ్ అని అడగని కొడుకు భార్యని సమానంగా గౌరవించలేని భర్త ఆడపడుచుని ఇంటికి పిలిచి చీర పెట్టని సోదరుడు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెల్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆడపిల్లే వద్దన్న ఆలోచనల్నికలిగువున్న భర్త/మామగారూ అమ్మ ఆలీ ఆడబిడ్డని ఉద్దేశించి తిట్టే కుసంస్కారం కల్గిన ప్రబుద్ధుల 'కామాతురాణం న స్మృతి న లజ్జ' గల కీచకులు ఆడవాళ్ళని ఉద్దేశించి గొప్ప మాటలు చిత్రాలుని సామాజిక మాధ్యమంలో శోధించి ప్రచురించడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. 'ఏత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతా' అని మనుశాస్త్రం కనీసం మనవరకు ఆడవాళ్ళని గౌరవిద్దాం, ఆడపిల్లల్ని చదివిద్దాం. మనోభావాలు నొప్పించడానికి కాదు అభిమతం తెలియపరచటానికి నాయీ అభ్యర్ధన. - శ్రీ (శ్రీనివాస్ జీ.)